![]() |
![]() |
.webp)
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -655 లో.....కార్తీక్, దీప ఇద్దరు శివన్నారాయణ ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతారు. నీకు దెబ్బ తగిలింది ఈ ఒక్కరోజు వెళ్లకుంటే ఏం కాదని కాంచన కోప్పడుతుంది. నువ్వు డ్రైవర్ వి ఇప్పుడు నీకు చేతికి గాయం అయింది ఎలా డ్రైవింగ్ చేస్తావని కాంచన అడుగుతుంది. అయినా వినకుండా వాళ్ళు అక్కడ నుండి వెళ్తారు. మరొకవైపు వాళ్ళ రాక కోసం జ్యోత్స్న ఎదురుచూస్తుంది. కార్తీక్ ని ఎక్కించుకొని దీప స్కూటీ పై ఎంట్రీ ఇస్తుంది. అది జ్యోత్స్న చూసి షాక్ అవుతుంది. నువ్వు వీరనారివి దీప అని జ్యోత్స్న క్లాప్స్ కొడుతుంది.
నా కోసం ఎంత చేసావ్ బావ అంటుంది కానీ నువ్వు మా అత్త కోసం ఏం చేస్తున్నావ్.. అసలు నీకు ప్రేమే లేదని కార్తీక్ అంటాడు. ప్రేమ లేదని ఎవరు చెప్పారని జ్యోత్స్న అంటుంది. ఉంటే ఎందుకు ఆ వైరాతో చేతులు కలుపుతావని కార్తీక్ అనగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. ఆ వైరా ఫోన్ చేసి అంతా చెప్పాడు అని కార్తీక్ చెప్తాడు. నీకు ఆసలు సిగ్గుందా అని దీప అంటుంది. జ్యోత్స్న, దీప ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. నేను కచ్చితంగా బావ చేత్తో నా మెడలో తాళి కట్టించుకుంటానని జ్యోత్స్న అనగానే నీ ముచ్చట నేను ఎందుకు కాదని అంటాను.. ఈ రోజు నుండి కచ్చితంగా నెల రోజులలో నీకు పెళ్లి జరిపిస్తాను.. మంచి అబ్బాయిని చూసి పెళ్ళి జరిపిస్తానని కార్తీక్ అంటాడు. కార్తీక్, దీప ఇద్దరు జ్యోత్స్న చెయ్ లో చెయ్ వేసి చెప్తారు. అప్పుడే పారిజాతం వచ్చి విజిల్ వేసి.. సూపర్ రా మనవడా అని అంటుంది.
ఆ తర్వాత పారిజాతం, కార్తీక్, దీప ముగ్గురు చేతులు కలిపి ఎలాగైనా జ్యోత్స్న ప్లాన్ ని తిప్పికొట్టి తనకు పెళ్లి చెయ్యాలని అనుకుంటారు. ఆ తర్వాత ఇంటికి పంతులుని పిలిపిస్తాడు కార్తీక్. ఎందుకు పిలిచావని దశరథ్ అడుగుతాడు. జ్యోత్స్న పేరున ఎలా ఉందో తెలుసుకోవడానికి అని కార్తీక్ చెప్తాడు. దాంతో అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. దీప నువ్వు వెళ్లి జ్యోత్స్నని తీసుకొనిరా అని కార్తీక్ అనగానే జ్యోత్స్న దగ్గరికి దీప వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |